హైదరాబాద్ : విజయవాడ కనకదుర్గ(Kanakadurga) అమ్మవారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) దర్శించుకున్నారు. అంతకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషంగా ఉంన్నారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టి తీరుతామన్నారు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ ఉంటారు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలన్నారు. కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏం చెప్పినా మేం కులగణన పూర్తి చేస్తామన్నారు.