KTR | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఆసియాలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. Dare to Dream, Then Decide to Do అనేది సీఎం కేసీఆర్ మంత్రం అని, ఆ నినాదంతోనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కొల్లూరు వద్ద నిర్మించిన హౌసింగ్ కమ్యూనిటీలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. మొత్తం 145 ఎకరాల్లో ఒక్కో యూనిట్‌కు 560 చదరపు అడుగుల పరిమాణంలో అన్ని వసతులను కల్పించినట్లు చెప్పారు. కొల్లూరు గృహ సముదాయాన్ని సీఎం కేసీఆర్ రేపు ప్రజలకు అంకితం చేస్తారని పేర్కొన్నారు.
‘Dare to Dream, Then Decide to Do’ has been mantra of KCR Garu
Proud to Introduce you to Asia’s largest 2BHK Dignity Housing community project built by Telangana Govt 😊
At Kollur in Sangareddy Dist, built by the Greater Hyderabad Municipal Corporation (GHMC)
✳️ 15,660 2BHK… pic.twitter.com/yp9EplhVbU
— KTR (@KTRBRS) June 20, 2023