Peddi | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ పెద్ది (Peddi). ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది. సాంగ్‌తోపాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం రాంచరణ్, జాన్వీకపూర్ టీం ఇటీవలే శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి హుక్ స్టెప్ ప్రోమో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
రేపు ఉదయం 11:07 గంటలకు చికిరి చికిరి పాటను లాంచ్ చేయనున్న నేపథ్యంలో మేకర్స్ చికిరి చికిరి పాటకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ లుక్‌లో రాంచరణ్ బీడీ తాగుతూ మరో హుక్ స్టెప్ వేసినట్టు కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ పాటలో ఎన్ని హుక్ స్టెప్స్ ఉండబోతున్నాయనేది సస్పెన్స్‌గా మారింది.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పెద్ది మార్చి 27న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
#Peddi First Single #ChikiriChikiri out tomorrow at 11.07 AM ❤🔥
Wait for @arrahman sir’s magic 🎼#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/xvvfUnOrje
— Ram Charan (@AlwaysRamCharan) November 6, 2025
Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం