KTR | హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు దశ దినకర్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు.
నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన సత్యనారాయణ రావు దశ దినకర్మకు హరీశ్‌రావు మద్దతుదారులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. గత నెల 28వ తేదీన తెల్లవారుజామున సత్యనారాయణ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.