కట్టంగూర్, నవంబర్ 06 : కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని చిలుముల శివాని అండర్ -17 విభాగంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కందాల రమ, వ్యాయామ ఉపాధ్యాయులు చింతమల్ల పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4న పాఠశాలలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ నెల 7 నుండి నారాయణపేట జిల్లా కొస్గిలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు.