కట్టంగూర్, నవంబర్ 06 : టీజీఐఆర్డీ సంస్థ అధ్వర్యంలో సమగ్రశిక్ష రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ కాంపీటీషన్ గురువారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిర్వహించారు. ఈ పోటీల్లో డ్యాన్స్ విభాగంలో పాల్గొన్న కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం 10వ తరగతి విద్యార్ధినులు లక్ష్మిప్రసన్న, నిమిష., ప్రియాంక, వైష్ణవి రాష్ట్రస్థాయి తృతీయ బహుమతికి ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్, అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.రాధారెడ్డి రూ.2 వేల నగదుతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ఎస్ఓ నీలాంబరి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.