Minister KTR | రాష్ట్రంలో రెట్టింపైన తలసరి ఆదాయం: మంత్రి కేటీఆర్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో ఉందన్నారు.
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో ఉందన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో లూలూ గ్రూప్ (Lulu Group) రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లూలూ సంస్థ పెట్టుబడులతో టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో పండే పత్తి దేశంలోనే అత్యున్నతమైనదని చెప్పారు.
చేపల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్ (Aqua Hub) సిద్ధమవుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వెల్లడించారు. రూ.300 కోట్లతో మెగా డెయిరీ ప్లాంట్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని వెల్లడించారు.
తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ చెప్పారు. ఫుడ్‌ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటుచేయబోతున్నామని వెల్లడించారు. రూ.3 వేలకోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్‌మాల్ ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే లూలూ మాల్‌కు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షాపింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.
Starting the week with good news
Many thanks to Sri @Yusuffali_MA Ji the Chairman and MD of @LuLuGroup_India for committing to ₹3,500 Crore investment in Telangana State
These investments will be in Food processing and retail sectors pic.twitter.com/ARTXRQaGPZ
— KTR (@KTRBRS) June 26, 2023
Industries Minister @KTRBRS speaking after Lulu Group International announced commencement of its operations in Telangana. #InvestTelangana https://t.co/N0BolJtPzQ
— KTR, Former Minister (@MinisterKTR) June 26, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Aqua hub
- CM KCR
- gdp
- Lulu group
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

