KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జానపద కళాకారుడు, పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొగిలయ్య మాట్లాడుతూ.. తనకు జాగా ఇప్పించాలని అడిగారు. తాను కోట్ల రూపాయలు కాదు కదా లక్షలు కూడా చూడలేదని, వెనుకటి నుంచి ఎన్నో కష్టాలు పడి బతుకు ఈడ్చానని చెప్పారు. అయ్య (కేసీఆర్) పుణ్యాన నాకు పేరు వచ్చిందని, ఆ జాగ ఒక్కటి ఇప్పిస్తే ఇగ ఏమీ అడగనని అన్నారు.
దాంతో మీ లాంటి పెద్దవాళ్లు అంత మాట అనవద్దని, మీకు తప్పకుండా జాగా ఇప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. కిన్నెర మొగిలయ్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నెలకు రూ.10 వేల పెన్షన్ను కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. దాంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసి సాయం చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్యే మల్లా రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. https://t.co/j1V2qLnoCl pic.twitter.com/WnjrAH0dTD
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2024