S Jaishankar : కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టుపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. నిజ్జర్ హత్యపై కెనడాలో ఏం జరిగినా వారి అంతర్గత రాజకీయాలే ఎక్కువగా ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఈ విషయంలో భారత్కు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ తప్పు చేసిందని కెనడా ఆరోపిస్తోందని విమర్శించారు.
హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు నిందితులకు ఉన్న సంబంధాలపై కెనడియన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని జైశంకర్ చెప్పారు. అరెస్టయిన ముగ్గురు భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని కెనడా పోలీసులు పంచుకునే వరకు భారత్ వేచిచూస్తుందని జైశంకర్ తెలిపారు. పంజాబ్లో వ్యవస్థీకృత నేరాలను కెనడా నుంచి ఆపరేట్ చేయడానికి అనుమతిస్తున్నారని తాము చాలాసార్లు ఆందోళన వ్యక్తంచేశామని విదేశాంగ మంత్రి అన్నారు.