స్కైరూట్ టీమ్‌కు గుడ్ లక్ చెప్పిన కేటీఆర్
Skyroot Aerospace | హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
హైదరాబాద్ : హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ లక్ చెప్పారు. సక్సెస్ కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రయోగించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్-ఎస్ అని నామరకణం చేశారు. కాగా, దీనిని ఈ నెల 12నే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో శాస్త్రవేత్తలు వాయిదావేస్తూ వస్తున్నాయి. అయితే నవంబర్ 18న ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించాలని తాజాగా నిర్ణయించారు.
ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లనుంది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించనుంది.
Good luck to Team Skyroot👍 we are all rooting for you https://t.co/yd6uRbxgUA
— KTR (@KTRTRS) November 17, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

