EC | కండిషన్స్ అప్లయ్.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ గ్రీన్‌సిగ్నల్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (EC) అనుమతి ఇచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది.
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (EC) అనుమతి ఇచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు భేటీలో పాల్గొనకూడదని తేల్చిచెప్పింది. శనివారం జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదాపడిన విషయం తెలిసిందే.
శనివారం నిర్వహించాలనుకున్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి రానందున క్యాబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ఈసీ అనుమతి కోసం వేచి చూశామని, అనుమతి రాకపోవడంతో సమావేశం కాలేకపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈసీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని, సోమవారం నాటికి అనుమతి రాకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఒకవేళ అనుమతి వచ్చి ఉంటే, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానకాలం పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతి లేకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణతోపాటు రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తి కావడంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను క్యాబినెట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. క్యాబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే క్యాబినెట్ భేటీ జరపాలని సీఎం నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
చిట్టెం చొరవతో జూరాల కాలువకు నీటి విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

