ఎన్పీఏ ప్రభుత్వానికి సిగ్గుచేటు..! కేంద్రంపై కేటీఆర్ ఫైర్..
హైదరాబాద్ : మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. గుజరాత్లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ట్విటర్ వేదికగా కేటీఆర్ సెటైర్లు వేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును ‘మోడెమోక్రసీ’ అంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్‌కు చెందిన, గుజరాత్ చేత, గుజరాత్ కోసం పని చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని విస్మరించారన్న కేటీఆర్.. ఎన్పీఏ ప్రభుత్వానికి సిగ్గు చేటని మండిపడ్డారు. వరంగల్‌కు కేంద్రం ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ రాకపోగా.. గుజరాత్‌కు మాత్రం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్రకటిస్తూ కేంద్రం ఇటీవలే కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్రావు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టగా.. కేటీఆర్ స్పందించారు.
Of Gujarat, By Gujarat, For Gujarat & To Gujarat – New definition of Modemocracy
Despite promises made in Parliament, Warangal in Telangana is denied locomotive coach factory
Shame on you NPA Govt https://t.co/gqptAayT7H
— KTR (@KTRTRS) April 22, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

