బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 17:56:29

ఉత్త చేతులతో కాకుండా సాయం తెస్తున్నరని ఆశిస్తున్నా : మంత్రి కేటీఆర్

ఉత్త చేతులతో కాకుండా సాయం తెస్తున్నరని ఆశిస్తున్నా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ జాతీయ నేతలు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. లోకల్‌ పార్టీని ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీ నేతలు పోలోమంటు తరలుతుండటంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. వరదలాగా ఢిల్లీ నుండి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాద్‌కు స్వాగతం అన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేదని చురకలంటించారు. ఉత్త చేతులతో రాకుండా వస్తూ వస్తూ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరదసాయంగా రూ.1350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


logo