హుజూరాబాద్ : ఈటల రాజేందర్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవం అంటే అర్థం తెలుసా? అని ఈటలను హరీశ్‌రావు సూటిగా అడిగారు. హుజూరాబాద్ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఆత్మగౌరవం అంటే ఆర్థిక స్వాలంబన జరగాలి. ఒక్కడి ఆత్మగౌరవాన్ని ప్రజల ఆత్మగౌరవంతో ముడిపెడితే సరిపోదు ఈటలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్ల మీద నిలబడి బతికినప్పుడే ఆత్మగౌరవం వచ్చినట్టు అవుతుందన్నారు. అందుకే పేదల ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆత్మగౌరవం అంటే తెలియనోళ్లు ఆ పదాన్ని ఉపయోగించకపోవడం మంచిదని హరీశ్‌రావు సూచించారు.