మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 14:34:09

తెలంగాణ‌కు బీజేపీ చేసిందేమీ లేదు : హ‌రీష్ రావు

తెలంగాణ‌కు బీజేపీ చేసిందేమీ లేదు : హ‌రీష్ రావు

సిద్దిపేట : భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌కు చేసిందేమీ లేదు అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. రైతుల‌ను క‌ష్టాల్లోకి నెడుతుంద‌న్నారు. వ్య‌వ‌సాయ పంపు సెట్ల వ‌ద్ద మీట‌ర్లు తెచ్చిపెట్టి.. రైతుల‌కు ఇబ్బందులు సృష్టిస్తుంద‌ని మంత్రి తెలిపారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలోని తొగుట‌లో టీఆర్ఎస్ యువ గ‌ర్జ‌న ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బైక్ ర్యాలీలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి ప్ర‌సంగించారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌వి వాపు మాత్ర‌మే.. నిజ‌మైన బ‌లం టీఆర్ఎస్ పార్టీదే అని హ‌రీష్ రావు తెలిపారు. సాధ్యం కాద‌నుకున్న తెలంగాణ‌ను టీఆర్ఎస్ పార్టీ సాధించింది. రాష్ర్ట ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుంటే ఎమ్మెల్యేలంద‌రూ రాజీనామా చేశారు. రాజీనామా చేయ‌కుండా కిష‌న్ రెడ్డి పారిపోయారు. తెలంగాణ తెచ్చింది తాము అని ఈరోజు బీజేపీ నేత‌లు మాట్లాడుతున్నారు. 70 ఏళ్ల‌లో కాంగ్రెస్, టీడీపీలు చేయ‌ని ప‌నుల‌ను టీఆర్ఎస్ పార్టీ చేసి చూపించింద‌ని తెలిపారు. రైతుల‌కు 24 గంట‌ల పాటు నాణ్య‌మైన విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌న‌కు రావాల్సిన నిధులు, నీళ్ల‌ను తెచ్చుకున్నామ‌ని పేర్కొన్నారు.

బీజేపీ న‌ల్ల‌ధ‌నం హామీ ఏమైంది? అని ప్ర‌శ్నించారు. దేశంలోని ప్ర‌తి పౌరుడి ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు వేస్తామ‌ని చెప్పారు. దేశంలో ఎవ‌రి ఖాతాలోనైనా రూ. 15 ల‌క్ష‌లు వేశారా? అని అడిగారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి  ఉద్యోగాలన్నారు. ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి క‌దా? మ‌రి ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. నిజామాబాద్‌లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. వచ్చిందా పసుపు బోర్డు అని అడిగారు. ముత్యం రెడ్డి మంచి నాయకుడని కాంగ్రెస్ మొసలి కన్నీరుకారుస్తోంది. అదే నిజమయితే కాంగ్రెస్ పార్టీ 2018లో టికెట్ ఎందుకు ఇవ్వలేద‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు.