శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 02:33:58

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌/సోన్‌: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలో రూ.50 లక్షలతో చేపట్టిన చేపల మార్కెట్‌ భవన నిర్మాణానికి బుధవారం మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనోపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం కోట్లాది చేప పిల్లలు, రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు. అలాగే చేపలను అమ్ముకునేందుకు వాహనాలను అందించిందని చెప్పారు. ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా పలువురు రైతులను మంత్రి సన్మానించారు.