జగిత్యాల : బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ(Migrant worker) నీటి సంపులో(Water sump) పడి అర్దాంతరంగా తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ సచిన్ చౌదరి(38) కొద్ది రోజుల నుంచి స్థానిక శివరామకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీ రైల్ మిల్లులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను బాయిలర్‌కు వాడే నీటి సంపు వద్ద వద్ద కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్