మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 13:55:04

అధ్యాప‌కుల వ‌యోప‌రిమితి పెంపు బిల్లు‌కు అసెంబ్లీ ఆమోదం

అధ్యాప‌కుల వ‌యోప‌రిమితి పెంపు బిల్లు‌కు అసెంబ్లీ ఆమోదం

హైద‌రాబాద్‌: మెడిక‌ల్ కాలేజీల్లో అధ్యాప‌కుల వ‌యోప‌రిమితిని పెంచుతూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి హ‌రీశ్‌రావు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. మెడిక‌ల్ కాలేజీల్లో నిపుణుల కొర‌త ఉన్నందువ‌ల్ల అధ్యాప‌కుల వ‌యోప‌రిమితి పెంచుతున్నామ‌ని మంత్రి అన్నారు. దీనిద్వారా ఐదు మెడిక‌ల్ కాలేజీల్లో ప‌నిచేస్తున్న అధ్యాప‌కుల వ‌యోప‌రిమితిని 58 నుంచి 65 ఏండ్ల‌కు పెంచుతున్నామ‌ని చెప్పారు. త‌ద్వారా 52 మంది ప్రొఫెస‌ర్ల‌ను కొన‌సాగించడానికి, అనుభ‌వ‌జ్ఞుల సేవ‌లు వినియోగించుకోవ‌డానికి అవకాశం ఉంటుంద‌ని చెప్పారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతున్న‌వారు ఎక్కువ‌తుండ‌టం, కోర్టు కేసుల‌తో కొత్త‌వారిని నియ‌మించుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వైద్య సేవ‌లు, విద్యార్థుల‌పై ప్ర‌భావం ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో అధ్యాప‌కుల వ‌యోప‌ర‌మితి పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని వెల్ల‌డించారు. 

మెడిక‌ల్ కాలేజీల్లో అధ్యాప‌కులు, వ‌స‌తుల‌పై ఏటా త‌నిఖీలు జ‌రుగుతాయ‌ని, వీటి ఆధారంగానే వైద్య‌ సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. అధ్యాప‌కులు లేక రాష్ట్రం వైద్య సీట్లు కోల్పోయే ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. సీట్లు కోల్పోతే రాష్ట్రానికి, విద్యార్థుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌న్నారు. అందుకే విద్యార్థుల‌పై ప్ర‌భావం లేకుండా బోధ‌నా సిబ్బంది వ‌యోప‌రిమితి పెంచుతున్నామ‌ని చెప్పారు. 


logo