Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) తదితర కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్ఎం) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | మే 1 తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : టీజీపీఎస్సీ
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ
KTR | ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్ వెళ్లొచ్చు.. కానీ