సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 13:11:39

కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో పలువురి చేరిక

కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో  పలువురి చేరిక

జగిత్యాల : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా  జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ కి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ప్రేమలతతో పాటు పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసే పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


logo