గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 23:05:16

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని పెంబర్తి యూటర్న్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జనగామ మండల కేంద్రానికి చెందిన ఎంబరి శివయ్య (35) ఉదయం పొలానికి వెళ్లి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.  పెంబర్తి యూటర్న్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు తరలించారు. బైపాస్‌పై సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే చేపట్టాలని గ్రామస్తులు హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎక్కడికక్కడా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వారికి నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.