యాదాద్రి భువనగిరి : గంజాయి(Ganja) విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు జంఖాన్గూడలో సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జహీర్ షేక్‌ను అదుపులోకి తీసుకుని అతని నుంచి వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అతన్ని భువనగిరి స్టేషన్లో ఎక్సైజ్ సిబ్బందికి అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా అక్రమంగా గంజాయిని విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Dhanush | హీరోగా, డైరెక్టర్‌గా.. ఒకేసారి ధనుష్ డబుల్ ట్రీట్
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్