మెదక్ : మెదక్ జిల్లా(Medak Dist) అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. కిషన్‌ను కానిస్టేబుల్ కొట్టడంతో మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి(Commits suicide) పాల్పడ్డాడు.
హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తతగామారాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు ఇష్యూలో అసలు దోషి రేవంత్ రెడ్డే : వై.సతీష్ రెడ్డి