Nagarkurnool | నాగర్‌కర్నూల్ : అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూర్ మండలం మైలారంలో రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో రైతుల రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ముందస్తుగా పలువురు రైతులను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
దీంతో తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని తక్షణమే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాలతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను, మహిళలను తెల్లవారుజామున 5 గంటలకే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని గ్రామస్తులు తెలిపారు. ఇక పోలీసులను గ్రామంలోకి రానివ్వకుండా శివారులో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు స్థానికులు.
మరో వైపు మైలారంలో స్థానికులకు మద్దతు తెలిపేందుకు పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. వారిని వెల్దండ వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మైనింగ్ వద్దు అన్నందుకు రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
మందు డబ్బులతో రోడ్డెక్కిన మహిళా రైతులు
నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం
మైలారం గ్రామంలో గ్రామస్తులను, రైతులని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులుపోలీసులు గ్రామానికి రాకుండా ముళ్ళకంచ ఏర్పాటు చేసిన మహిళలు
స్వచ్ఛందంగా… pic.twitter.com/xxTqFN6aIt
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025
ఇవి కూడా చదవండి..
BRS | నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా.. అనుమతి నిరాకరించిన పోలీసులు
KTR | కటింగ్‌లు, కటాఫ్‌లు మినహా.. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటి..? : కేటీఆర్
Ration Cards | దరఖాస్తులు 300.. అర్హులు 40 మందే.. తప్పుల తడకగా రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితా!