సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:16

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామా బాద్‌  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పార్టీ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల శనివారం హైదరాబాద్‌లో కవితను కలిసి 50 దేశాల్లోని ఎన్నారైల తరఫున అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కవిత మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ మెడికల్‌ జాక్‌ సభ్యులు ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రభుత్వ వైద్యులు ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాలు కాపాడారని ఈ సందర్భంగా కవిత అభినందించారు. కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు విలువైన సేవలందించారని వారిని ప్రశంసించారు. కవితను కలిసిన వారిలో తెలంగాణ మెడికల్‌ జాక్‌ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌, స్టేట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, కోఆర్డినేటర్‌ నరహరి, కోచైర్మన్‌ రఘుతోపాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.