KTR | నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇక తమకు గొడ్డు కారం పెడుతున్నారంటూ విద్యార్థులు తమ సమస్యలను కేటీఆర్‌కు విన్నవించుకుని బాధపడ్డారు.
వీసీ అరాచక పాలన కొనసాగిస్తున్నారని విద్యార్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని బాధిత విద్యార్థులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే యూనివర్సిటీకి భవనాలు మంజూరు అయ్యాయని విద్యార్థులు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ పాలనలో కడుపు నిండా అన్నం తినే వాళ్లమని విద్యార్థులు పేర్కొన్నారు. వీసీని తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను విద్యార్థులు అభ్యర్థించారు. విద్యార్థులకు అండగా ఉంటామని, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు.
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చేరుకుని, విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/rEt4HfJBQK
— BRS Party (@BRSparty) January 28, 2025
ఇవి కూడా చదవండి..
KCR | ఆదివాసీల ఐక్యతకు ప్రతీక నాగోబా జాతర : కేసీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్