Trisha Gongadi | ఐసీసీ వుమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించి రికార్డును నెలకొల్పింది. వుమెన్స్ అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన తొలి వుమెన్స్ క్రికెటర్‌గా నిలిచింది. అదే సమయంలో బంతితోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టింది. మలేషియాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్తో టీమిండియా తలపడింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకుంది. ఓపెనర్లు కమలిని, గొంగడి త్రిష చెలరేగి ఆడారు. ఓపెనర్లు కమలినీ, త్రిష గొంగాడి బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 67-0తో బలమైన స్కోరును సాధించింది. పది ఓవర్లు ముగిసే వరకు భారత్ వికెట్ నష్టపోకుండా 104 పరుగులతో చేసింది.
ఓపెనర్లు ఇద్దరు కలిసి ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్‌కు ఇద్దరు అజేయంగా 147 పరుగులు జోడించారు. మ్యాచ్‌లో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి త్రిష 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. కమిలిని 42 బంతుల్లో 51 పరుగులు చేయగా.. మరో బ్యాట్స్‌వుమెన్ సానికా చల్కే 20 బంతుల్లో 29 పరుగులు చేసింది. ముగ్గురు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 58 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడగా.. బౌలర్లు స్కాట్లాండ్ను బౌలింగ్‌తో వణికించారు. ఆయుషి శుక్లా మూడు ఓవర్లు వేసి 8 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టింది. వైష్ణవి శర్మ ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. గొంగడి త్రిష రెండు ఓవర్లు వేసి.. ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది.
Milie Kerr: కివీస్ ఆల్‌రౌండర్‌కు ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
Virat Kohli | ఢిల్లీ రంజీ జట్టులోకి చేరిపోయిన కోహ్లీ.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్