న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ మెలీ కెర్‌ను.. ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీకి ఆమె ఎంపికైంది. 2024లో అద్భుతమైన మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డుకెక్కింది. క్రికెట్‌కు చెందిన మూడు ఫార్మాట్లలో కెర్ గత ఏడాది అద్భుత ప్రదర్శన ఇచ్చింది. రేచల్ హేవో ఫ్లింట్ అవార్డు కోసం లౌరా వోల్వార్డ్, చామరి ఆటపట్టు, అన్నాబెల్ సుదర్లాండ్ పోటీపడ్డారు. కానీ కివీస్ క్రికెటర్‌ను ఆ అవార్డు వరించింది.
మూడు ఫార్మాట్లలోనూ ఆమె వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్‌గా నిలిచింది. ప్రపంచంలోని మేటి మహిళా లెగ్ స్పిన్ బౌలర్‌గా కెర్ కీర్తికెక్కింది. బ్యాటింగ్‌లోనూ కివీస్ లైనప్‌ను మరింత పటిష్టం చేసింది. మిడిల్ ఆర్డర్లో బలమైన బ్యాటర్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడింది. రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ అవార్డును 2017 నుంచి ప్రకటిస్తున్నారు. ఎలిసీ పెర్రీ(ఆస్ట్రేలియా), స్మృతి మందాన(ఇండియా), స్కీవర్ బ్రుంట్(ఇంగ్లండ్) ఇప్పటి వరకు ఈ అవార్డును గెలుచుకున్నారు.
రేచల్ అవార్డును గెలుచుకున్న తొలి కివీస్ ప్లేయర్‌గా కెర్ నిలిచింది. ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డును కూడా గెలవడం కివీస్ క్రికెటర్‌కు ఇదే మొదటిసారి. 2024లో 9 వన్డేలు ఆడిన కెర్.. వాటిల్లో 33 సగటుతో 264 రన్స్ చేసింది. ఆ ఫార్మాట్లో 14 వికెట్లు కూడా తీసింది. టీ20 మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన కెర్… 18 మ్యాచుల్లో 387 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత 29 వికెట్లను కూడా తీసుకున్నది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధికంగా 15 వికెట్లు తీసుకున్నది.
After a stellar 2024, capped off by a #T20WorldCup triumph, Melie Kerr wins the Rachael Heyhoe Flint Award as ICC Women’s Cricketer of the Year 👏 pic.twitter.com/4Ayf15zRij
— ICC (@ICC) January 28, 2025