Lovers Suicide | సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టు వద్ద విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రేమికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి వద్ద హరిత రెస్టారెంట్లో నిన్న మధ్యాహ్నం ఓ ఇద్దరు ప్రేమికులు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా గది తెరవకపోవడంతో.. రెస్టారెంట్ సిబ్బంది అప్రమత్తమైంది. పోలీసుల సమక్షంలో ఆ గది తలుపులు తెరిచి చూడగా ప్రేమికులిద్దరూ ఉరేసుకున్న దృశ్యం కనిపించింది. పోలీసులు డెడ్‌బాడీలను కిందకు దించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.
ప్రేమికులను నారాయణఖేడ్ పరిధిలోని నిజాంపేట్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులను ఉదయ్‌కుమార్(21), మౌనిక(19)గా పోలీసులు నిర్ధారించారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మాజీ ఉప రాష్ట్రపతి అట..!