Revanth Reddy Family | పొద్దున్నే లేస్తే మాకు రాజ్యాంగమే వేదమంటూ.. చేతిలో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది.
ఒక వైపు రాజ్యాంగ సంవిధాన్ సదస్సులు నిర్వహిస్తుండగానే.. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు సజీవసాక్ష్యం.. వికారాబాద్ జిల్లాలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తుండటమే.. హస్తం పార్టీ ద్వంద్వ వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం. రాజ్యాంగం పట్ల రేవంత్ ఫ్యామిలీకి ఏ మాత్రం గౌరవం లేదని ఈ ఘటన రుజువు చేస్తుంది.
రాజ్యాంగ విలువలకు భిన్నంగా రాష్ట్రంలో నిరంకుశ పాలనకు తెరలేపారు రేవంత్ రెడ్డి. ఓవైపు రాజ్యాంగం పైన గౌరవం ఉందంటూనే.. మరోవైపు రాజ్యాంగస్ఫూర్తిని కాలరాస్తూ బరితెగింపులకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ పాలనకు పెద్ద పీట వేస్తూ ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా అరాచకాలకు పాల్పడుతూ.. అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తన సోదరుడు తిరుపతి రెడ్డికి రాజకీయంగా ఎలాంటి హోదా లేనప్పటికీ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అరాచకాలు కొనసాగిస్తున్నారు. అనుముల కుటుంబ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. క్షేత్రస్థాయిలో చెప్పేదానికి, చేసేదానికి విరుద్ధంగా ఉండడంతో ప్రజలు అస్యహించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారు. పార్టీ మారకపోతే బెదిరింపులకు పాల్పడి.. బ్లాక్ మెయిల్ చేసి.. పార్టీ మారేలా కుట్రలు చేశారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధేమో మేం పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని.. రాజ్యాంగ ప్రతులను చేతబట్టుకొని ప్రతిన బూనారు. కానీ తెలంగాణలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపులపై రాహుల్ కనీసం నోరు మెదపలేదు. పార్టీ ఫిరాయింపుల తర్వాత.. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలోనూ రేవంత్ సర్కార్ నిబంధనలను ఉల్లంఘించింది. ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన ఆ పదవిని.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేకు కట్టబెట్టింది. ఇక లగచర్లలో కూడా రైతులను అక్రమంగా అరెస్టు చేసి.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించింది రేవంత్ ప్రభుత్వం. రైతుల చేతులకు సంకెళ్లు వేసి.. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసింది కాంగ్రెస్ సర్కార్.
ఇలాంటి అరచకాల వల్ల రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా పార్టీ మనుగడకు కష్టమవుతుందనే విషయాన్ని అగ్ర నాయకత్వం గ్రహించాలి. ఇప్పటికైనా రాహుల్ మాటల్లో కాకుండా చేతల్లో తన చితశుద్ధిని నిరూపించుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మేధావులు, కవులు, రచయితలు స్పందించకపోవడం దారుణం. పొద్దున్నే లేస్తే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్పై నాలుక పారేసుకునే మేధావులు.. ఈ ఘటనపై స్పందించకపోవడం రాజ్యాంగం పట్ల తమకు ఎంత గౌరవం ఉందో అనే విషయం తేటతెల్లమవుతుంది.
BIG EXCLUSIVE
ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు,జడ్పిటిసి, ఎంపిటిసి కాదు, సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డ్ మెంబర్ కాదు..
కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు
అందరికీ ఆయన సీఎం అన్న
అయితే ఆ జిల్లాలో మాత్రం ఆయనే… pic.twitter.com/evjI4qfe9P— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
పేరుకు ప్రజా పాలన,
ఇందిరమ్మ రాజ్యం.కానీ వికారాబాద్ లో మాత్రం
ఫ్యామిలీ పాలన
అనుముల రాజ్యాంగంహైదరాబాదులో వీళ్ళు ఉండడానికి ఖరీదైన విల్లాలు, ప్యాలెస్లు
సీఎం గురించి తెలిసిందే, లక్షలు విలువ చేసే టీ షర్టులు, చెప్పులు, షూలు
పిల్లలకు కనీసం చెప్పులు లేవన్న సోయి కూడా లేకుండా ఎండలో… https://t.co/MjkPfm99gu pic.twitter.com/0haAArfDV8
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
ఇవి కూడా చదవండి..
Canada PM | ప్రధాని ట్రూడో స్థానంలో మార్చి 9న కొత్త నాయకుడి ఎన్నిక.. ప్రకటించిన లిబరల్ పార్టీ