Bhatti Vikramarka | హైదరాబాద్ : మల్లు భట్టి విక్రమార్క.. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న నాయకుడు. డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకుడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న హస్తం పార్టీ నేత.
డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లు భట్టి విక్రమార్క.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాజీ ఉప రాష్ట్రపతి అయిపోయారు. అదేంటని అనుకుంటున్నారా..? అవునండి మీరు వింటున్నది నిజమే. రాజమండ్రిలో 8, 9 తేదీల్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన స్వాగత ఫ్లెక్సీల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేస్తున్న భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ మల్లు భట్టి విక్రమార్కకు స్వాగతం పలుకుతూ తెలుగు భాష ఔత్సాహికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క అసలు ఉప రాష్ట్రపతి ఎప్పుడు అయ్యారని నెటిజన్లు ప్రశ్నించుకుంటున్నారు.
రాజానగరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఈ మహా సభలు ప్రారంభోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. ఇంకా 560 మంది కవులు పాల్గొన్నారు. నన్నయ, రాజరాజ నరేంద్రుడు, కందుకూరి పేర్లతో మూడు వేదికలపై మహాసభలు జరిగాయి.
ఇవి కూడా చదవండి..
Sankranthi Holidays | రేపట్నుంచి సంక్రాంతి సెలవులు.. 18న పునఃప్రారంభం