హైదరాబాద్: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది. శనివారం ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపళ్లి, ములుగు, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.