Harish Rao | హైదరాబాద్ : ప్రజా పాలన పేరుమీద నయా రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
మీ దుర్మార్గమైన పాలనను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఏడాది కాలంగా మీరు చేస్తున్న దోపిడి చూస్తే ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది.. ఇది రజాకార్ల పాలన కంటే దారుణమైన పాలన అని. ఈ క్రమంలోనే ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు యత్నిస్తున్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే.. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. హరీశ్‌రావును అరెస్టు చేసి భయపెట్టించాలనుకోవడం.. సీఎం మూర్ఖత్వమే. అక్రమ అరెస్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి హరీశ్‌రావు, పాడి కౌశిక్ రెడ్డితో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
N.Sridhar | విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్..
KTR | ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులా..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం