N.Sridhar | విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్..
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను (N.Sridhar) ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను (N.Sridhar) ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన కొనసాగుతారని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వాలంటరీ రిటైర్మెంట్కు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో వెంకటేశం స్థానంలో ఎన్.శ్రీధర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. మొదట రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్‌గా కాకినాడలో పని చేశారు. అనంతరం అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రెటరీగా మూడేళ్ల మూడు నెలల పాటు పని చేశారు. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ స్థానంలో బలరామ్‌ను సీఎండీగా నియమించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

