కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ (Kadthal) మండల కేంద్రంలో కొలువైఉన్న భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు (Lakshmi Chennakesava Swamy Temple) ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గ్రామ ప్రధాన పురోహితుడు మెళ్ళూరి వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మ వారికి కుంకుమార్చన, ఆలయ ఆవరణలో పూర్ణాహుతి, చక్రతీర్థం, నాగవల్లి, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని గరుడ వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులగుండా స్వామి వారిని ఊరేగించారు.
అలాగే స్వామి వారి దగ్గర దోపోత్సవము, హనుమాన్ చాలీసా పారాయణం, ఆకు పూజ తదితర కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, రాములు యాదవ్, శాయిరెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, హర్షవర్ధన్, లాయక్అలీ, ప్రకాశ్, మల్లేశ్, సంతోశ్, శ్రీకాంత్, బాబు, శ్రీను, ఆలయ అనువంశీక అర్చకులు రఘురాం, వేణుగోపాల్, శ్రీధర్, శ్రీమన్నారయణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Also Read..
కేసీఆర్ను విమర్శించే హక్కు లేదు
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..?