వికారాబాద్, ఫిబ్రవరి 14 : గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజ న హాస్టల్లో ఉంటూ టెన్త్ చదువుతు న్న మద్గుల్చిట్టంపల్లి అనుబంధ గ్రామం టేకులబీడుతండాకు చెందిన విద్యార్థి దేవేందర్ అనుమానాస్పదంగా మృతి చెందగా..
శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆనంద్.. అతడి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడుతూ.. విద్యార్థి మృతి తనను కలచివేసిందని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఓ పేద విద్యార్థి మరణించాడని మండిపడ్డారు.
విద్యావ్యవస్థలో పర్యవేక్షణ లోపించిందని, చదువుకునే పిల్లలకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రతిరో జూ కల్తీ ఆహారం తింటూ చస్తున్నామని.. మంచి భోజనం పెట్టాలని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఎన్ని ధర్నాలు చేసినా..ఎంత మొ త్తుకున్నా… ఈ ప్రభుత్వానికి చలనం లేదని.. ఇంకా ఎంతమంది చనిపోతే పట్టించుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులు పాము, తేలు, ఎలుక కాట్లకు గురవుతున్నారని.. మరికొన్ని హాస్టళ్ల లో కనీసం ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియలేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలైన ఘటనలు ఈ సర్కార్ నిర్లక్ష్యంతో జరుగుతూనే ఉన్నాయన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గోపాల్, నాయకులు నర్సింహులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మల్లయ్య, మాణేయ్య, రఫీ, కిష్టయ్య, రాములు పాల్గొన్నారు.