Lagacherla | హైదరాబాద్ : సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం.. లగచర్ల రైతులపై ఉక్కుపాదం మోపుతూ వారి భూములను అక్రమంగా గుంజుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ చివరకు రైతులు ఎదురు తిరగడంతో.. వారిని జైలు పాలు చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో లగచర్ల బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిసి ఫిర్యాదు చేశారు. తమ గోడును విన్నవించుకున్నారు. తాజాగా రాష్ట్రపతి భవన్‌కు లగచర్ల బాధితుల గోడును వినిపించాడు సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్. లగచర్లలో అక్రమ భూ సేకరణ, గిరిజన మహిళలపై దాడులు, రైతుల అక్రమ అరెస్టులపై రాష్ట్రపతి కార్యాలయంలో గవినోళ్ళ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలోని పరిసర తాండాలలో ఫార్మ కంపేని పేరుతో దళిత, గిరిజన బలహీన వర్గాల రైతుల భూములను దౌర్జన్యంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తూ వారిపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు, అక్రమంగా భూసేకరణ చేయకుండా, ఫార్మా కంపెనీ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయుట కోసం తమరి జోక్యం గురించి.
తమరితో మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండల పరిధిలోని లగచర్ల, దాని పరిసర తాండాలో ఫార్మ కంపేని పేరుతో దళిత, గిరిజన, బలహీన వర్గాల రైతులకు చెందిన దాదాపు 1100ల ఎకరాలు భూమి సేకరించడానికి అక్రమంగా నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఫార్మా సిటీ కోసం 12000 ఎకరాల భూమి సేకరించి పెట్టింది. అక్కడ అన్నివసతులు ఉన్న ప్రాంతంలో కాకుండా కేవలం వ్యక్తిగత లాభం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓట్లు వేసిన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, దౌర్జన్యంగా రైతులను బెదిరిస్తూ, పోలీసులు అధికారుల ద్వారా అక్రమ భూసేకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసులు రైతులను, మహిళాలను, వృద్ధులను, చిన్న పిల్లలు అని చూడకుండా అర్ధరాత్రిపూట వారి ఇండ్లపై దాడులుచేస్తూ, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అక్రమ అరెస్టులు చేసి జైలులో వేశారు. ఇట్టి విషయములో గిరిజన, దళిత, బలహీన వర్గాల జీవనోపాధియైన భూమిని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం రైతుల అస్థిత్వం మీద దెబ్బకొట్టడమే. ఇలాంటి పరిస్థితులలో పరిపాలన అనుభవంలేని రేవంత్ రెడ్డికి ఓట్లువేసి గెలిపించినా సొంత నియోజక వర్గంలోని ప్రజలనే ఇబ్బంది పెడుతున్నారు. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతిరెడ్డి భాధిత రైతుల ఇండ్లపైకి వందలాది మంది అసాంఘీక వ్యక్తులను తీసుకెళ్ళి “మీ భూములు ఇవ్వకుంటే, తన్ని తీసుకుంటాము” అని బహిరంగాగానే ప్రజలను బెదిరిస్తున్నారు. గత 6నెలల నుండి మా భూములు అక్రమంగా గుంజుకోవద్దని భాదిత రైతులు శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపినా, ప్రభుత్వానికి విన్నవించినా కూడా అవి ఏవి పట్టించుకోకుండా దౌర్జన్యంగా భూసేకరణకు పూనుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయకుండా అనవసరమైన పనులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కాబట్టి దయచేసి అక్రమ భూసేకరణ నోటిఫికేషన్ రద్దుచేసి, దళిత, గిరిజన, బలహీనవర్గాల హక్కులను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదలపై జరుగుతున్న దాడులను అరికడుతూ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిందిగా మనవి అని పేర్కొన్నారు గవినోళ్ల శ్రీనివాస్.
ఇవి కూడా చదవండి..
KTR | ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..! హిమాచల్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ట్వీట్