Harish Rao | హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో అటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను, ఇటు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నాణ్యతో కూడిన భోజనాన్ని అందించారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో అవసరమైన పోషకాహారాన్ని కూడా అందించలేకపోతున్న పరిస్థితి ఉంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం వడ్డిస్తున్నారు. నీళ్ల చారు, నాణ్యత లేని పప్పును అందిస్తున్నారని తెలిపారు. వారానికి మూడుసార్లు ఇచ్చే గుడ్డు కూడా మాయమైందని గుర్తు చేశారు.
విద్యార్థులకు గుడ్ల పంపిణీ ఏడాదిగా నిలిచిపోయిందని, బిల్లులు రాక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు 11 నెలలుగా జీతాల్లేవు. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు అని చెప్పారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగూ విద్యాశాఖను పట్టించుకోడు కాబట్టి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ఇదే నిదర్శనం.
మధ్యాహ్న భోజనం అధ్వాన్నం.
ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత
లేని పప్పు. వారానికి మూడు సార్లు
ఇచ్చే గుడ్డు మాయం.ఏడాదిగా నిలిచిన గుడ్డు పంపిణీ
బిల్లులు రాక నిర్వాహకులు అవస్థలు
11 నెలలుగా వేతనాల కోసం ఎదురు… pic.twitter.com/FiopRxZvKb— Harish Rao Thanneeru (@BRSHarish) November 20, 2024
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 పిటిషన్లపై విచారణ నవంబర్ 26కు వాయిదా
Holidays | వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. బలవంతంగా ప్రయివేటు స్కూళ్ల మూసివేత..!