Harish Rao | కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను కూడా మోసం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులను, మహిళలను, మహిళలను, గిరిజనులను, బలహీనవర్గాలను కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహాన్ని తలపెట్టింది. ఈ శాసనసభ సమావేశాలు కనీసం నెల రోజులు నడపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఏసీ సమావేశంలో డిమాండ్ చేయాలని కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది. ఏయే అంశాల మీద మాట్లాడాలనే దానిపై బీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు.
ముఖ్యంగా కాళేశ్వరం జలాల విషయంలో అవకాశం ఉన్నా కూడా కాళేశ్వరం జలాలు ఎత్తకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం మీద గట్టిగా నిలదీయాలని నిర్ణయించామన్నారు హరీశ్ రావు. అదే విధంగా పాలమూరు ఎత్తివేతల పథకం కేసీఆర్ దాదాపు 80 శాతం పని పూర్తి చేస్తే.. థర్డ్ ప్యాకేజీలో చిన్న పని పూర్తి చేస్తే..దాదాపు 50-60 టీఎంసీల రిజర్వాయర్లను నింపుకునే అవకాశముంది. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుపకపోవడం వల్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా శాసనసభలో నిలదీయాలని నిర్ణయించుకోవడం జరిగిందని హరీశ్ రావు వెల్లడించారు.
పిల్లల చదువులు ఆగమైపోతున్నయి.
నిషేధిత జాబితాలో ప్రజల ఆస్తులను, వ్యవసాయ భూములను పెట్టి ఈ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కనుక ఈ 22ఏ అంశం మీద ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలనుకున్నాం. అదే విధంగా కరెంట్ కోతలు, రైతు బంధు, రుణమాఫీ, పాలిటెక్నిక్ విద్యార్థుల విషయంలో తెచ్చిన జీవో 97 రద్దు చేయాలని, రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితుల మీద, సింగరేణి కుంభకోణాల మీద, ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ, డీఏలు చెల్లించాలని, ఈహెచ్ఎస్ విధానంలో ఫెయిల్యూర్‌పై గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయించాం. ముఖ్యంగా రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు ఆగమైపోతున్నయి.. పిల్లల భవిష్యత్ ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఫీజు రీయింబర్స్ మెంట్ మీద ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని.
అసెంబ్లీ స్తంభింపజేసైనా..
శాసనసభ స్తంభింపజేసైనా విద్యార్థులకు న్యాయం జరిగేదాకా గట్టిగా ప్రశ్నించాలని డిసైడ్ చేశామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలుముగిసిన తర్వాత రాబోయే రోజుల్లో కేసీఆర్ కాళేశ్వరం నీళ్ల ఎత్తిపోతల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ లక్షలాది మందితో కేసీఆరే స్వయంగా పాలమూరు ఎత్తిపోతల పథకంపై ప్రత్యక్ష పోరాటానికి దిగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద, ఇటు కాళేశ్వరం మీద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి, ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న తీరుకు రైతాంగానికి నష్టం చేస్తున్న తీరుకు నిరసనగా కేసీఆర్ 2 ప్రాజెక్టుల మీద ప్రత్యక్ష పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని లక్షలాది మందితో పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Live: బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులుhttps://t.co/DN6ZIoe4ya
— BRS Party (@BRSparty) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్‌కి షాకిచ్చిన ఆడియన్స్!