మంగళవారం 26 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 09:50:54

ఆలయాలకు కార్తీక శోభ.. కిటకిటలాడిన ఆలయాలు

ఆలయాలకు కార్తీక శోభ.. కిటకిటలాడిన ఆలయాలు


జయశంకర్‌ భూపాలపల్లి : రాష్ట్రంలోని శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని గోదావరి నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. నదుల్లో స్నానాలు చేసి, దీపాలను వదిలి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పౌర్ణమి సందర్భంగా భక్తులు గోదావరి స్నానాలు చేసి, నదిలో దీపాలను వదిలారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేయించుకున్నారు. అలాగే పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు. ఉసిరి, మారేడు చెట్టు వద్ద లక్ష లక్ష దీపాలను వెలిగించారు.

యాదాద్రిలో భక్తుల సందడి..


భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా భక్తులు సందడి నెలకొంది. తెల్లవారుజామున నుంచి భక్తులు పుష్కరణిలో స్నానాలు చేసి దీపారాధన చేశారు. దీపారాధన చేపట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతాల వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయ పుర వీధుల్లో భక్తుల కోలాహలం నెలకొంది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు.

ధర్మపురిలో..