మా జీవితాల బాగు కోసం దళిత బంధు అమలు చేస్తున్న కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇంకా పది, ఇరవై సంవత్సరాలు కానీ.. బతికినన్ని దినాలు కేసీఆర్‌కే ఓటేస్తాం. మా పేద కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాడు. కేసీఆర్‌కు వందనాలు తెలుపుతున్నా.
కేసీఆర్‌కు సపోర్ట్‌గా ఉంటాం. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేసిండు. ఇప్పుడు మన దళితుల కోసం 10 లక్షల చొప్పున సాయం చేస్తుండు. ఆయన మొండిగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ సపోర్టు చేయండి. 10 లక్షల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి ఇస్తానని కేసీఆర్ మాటిచ్చిండు. ఆ మాట తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పిండు. ఎవరు అనుమానపడకుండా ఉండండి. అపోహతో ఉండకండి. కేసీఆర్‌ను నమ్మి.. టీఆర్ఎస్కు ఓటేద్దాం.
– దళిత మహిళలు ( కమలాపూర్ )