శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 16:20:34

ప్ర‌పంచ స్థాయి టూరిజం కారిడార్ గా ఉమ్మడి వ‌రంగ‌ల్ అభివృద్ధి

ప్ర‌పంచ స్థాయి టూరిజం కారిడార్ గా ఉమ్మడి వ‌రంగ‌ల్ అభివృద్ధి

ములుగు : అద్భుత‌మైన ప్ర‌పంచ స్థాయి టూరిజం కారిడార్ గా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్  జిల్లా అభివృద్ధి చెందుతుంద‌ని  ఎమ్మెల్సీ  పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. వ‌రంగ‌ల్ ని అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిల‌పాల‌న్న‌దే సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. అందునా వ‌రంగ‌ల్ టూరిజం విష‌యంలో వారు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.  రామ‌ప్ప‌ని సంద‌ర్శించిన శ్రీ‌నివాస రెడ్డి, ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌గ‌తిలో ఉండి క‌రోనా ఎఫెక్టుతో ఆగిపోయిన ప‌నుల‌న్నింటినీ తిర‌గి వేగిరం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అక్క‌డి అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, రామ‌ప్ప అతి పురాత‌న‌మైన శిల్ప క‌ళా వైశిష్ట్యంతో కూడిన దేవాల‌య‌మ‌న్నారు. అలాగే ల‌క్న‌వ‌రం స‌హ‌జ‌సిద్ధంగా కొద్దిపాటి మాన‌వ ప్ర‌త‌య్నంతో కాక‌తీయుల కాలంలో ఏర్పాటు చేసిన అతి పెద్ద చెరువు అని చెప్పారు. క‌రువు కాట‌కాల నుంచి రాజుని ఎదురించి త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేసిన పోరాట యోధులు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల గ‌డ్డ మేడారం . మ‌రోవైపు కాక‌తీయుల రాజ‌ధాని, కోట‌, ఏక‌శిలా న‌గ‌రం, ఆదిక‌వి పాల్కురికి సోమ‌నాథుడు, పోత‌నామాత్యుడు, క‌వులు, క‌ళాకారులు.. చారిత్ర‌క ప్ర‌దేశాల‌తో ఇంతగా సంస్కృతీ, సంప్ర‌దాయాల‌ను, చ‌రిత్ర‌ను తెలిపే న‌గ‌రాలు అర‌దుగా ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ చ‌రిత్ర‌, సంస్కృతి మీద అత్యంత అవ‌గాహ‌న ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్ ని అగ్ర‌గామిగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్నారు. 


logo