మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళను గొంతు నులిమి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే…మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో అత్త, మామ, భర్త, మరిది నలుగురు కలిసి కోడలి(స్వప్న ) గొంతు పిసికి చంపేసిన సంఘటన గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీజులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వప్ప మృతితో పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతురాలి అత్తింటి వారు పారిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sarpanch Candidate | పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థి మృతి.. నేలకొండపల్లిలో విషాదం
‘విమానయానం’లో 23 శాతం పోస్టులు ఖాళీ.. దేశంలో 1,260 ఏటీసీల కొరత
11 లక్షల జీతమొస్తేనే పెగ్ వేయాలిక్కడ!.. సౌదీ అరేబియాలో మద్యం షాపు వింత నిబంధన