హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో విషాదం చోటుచేసుకున్నది. ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి (Sarpanch Candidate) మరణించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న దామాల నాగరాజు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒత్తిడికి గురైన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులో ఆయనను దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మరణించారు.