న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అలాగని వాటి అమ్మకాలను నిలిపివేస్తే ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతుంది. ప్రజల నుంచి నిరసన వస్తుంది. దీంతో మద్యం అమ్మకాలకు (Alcohol Sales) కొన్ని దేశాల్లో విధించిన నిబంధనలు నవ్వించేలా ఉంటే మరికొన్ని షాక్ కలిగిస్తాయి. సౌదీ అరేబియాలోని (Saudi Arabia) ఒక దుకాణం ఇటీవల పెట్టిన నిబంధనలు మాత్రం అందరినీ షాక్‌కు గురి చేశాయి. మద్యం కొనుగోలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా తమ జీతం స్లిప్‌ను చూపించి తమ ఆదాయాన్ని నిరూపించుకోవాలి.
ఓస్ అంతే కదా అనుకోకండి! మీ జీతం తప్పనిసరిగా 50 వేల రియాల్స్ (సుమారు రూ.11 లక్షలు) లేదా అంతకు మించి ఉండాలి. అంటే ఉన్నత ఉద్యోగాలు చేసేవారికి తప్ప, చిన్నా చితకా ఉద్యోగాలు చేసే వారికి ఆ షాపులో మద్యం అమ్మరు. ఈ షాపు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉంది. తొలుత ఈ మద్యం షాపు కేవలం విదేశీ దౌత్యవేత్తల కోసం మాత్రమే తెరిచినప్పటికీ, కొంత కాలంగా ప్రీమియం హోదా ఉన్న ముస్లిమేతరులకు కూడా మద్యం అమ్ముతున్నారని బ్లూంబర్గ్ న్యూస్ తెలిపింది. ఈ షాపు నిబంధనలపై సామాజిక మాధ్యమంలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. ‘ఈ రూల్ భారత్‌లో లేనందుకు భగవంతునికి కృతజ్ఞతలు’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా.. ‘ఒక సీసా మద్యం కోసం ఆదాయం రుజువు చూపాలా.. ఇదేం పిచ్చి’ అని ఒకరు కోప్పడ్డారు. ‘