శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 14, 2020 , 20:57:09

ఐఈడీ బాంబు వెలికితీత

ఐఈడీ బాంబు వెలికితీత

చర్ల ‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు  మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి. కూంబింగ్‌కి వచ్చే భద్రతా బలగాలను టార్గెట్‌ చేస్తూ అమర్చిన మందుపాతరను ముందుగానే గుర్తించి వెలికితీశారు. దీంతో భద్రతా బలగాలకు పెనుప్రమాదం తప్పింది. తెలిసిన వివరాల ప్రకారం.. దంతెవాడ జిల్లాలోని సద్దర్‌ - తులస్‌గుఫా రోడ్డులో మావోయిస్టులు మందుపాతరలు అమర్చినట్లుగా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్‌ 195 బెటాలియన్‌ దళం రోడ్డుపై తనిఖీ చేపట్టింది. బాంబ్‌ స్కాడ్‌ బృందం ఆ ప్రాంతంలో మూడు కిలోల బరువు ఉన్న ఐఈడీ బాంబును వెలికితీసింది. అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


logo