HYDRAA | హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం అని స్పష్టం చేశారు. ఈ ఏడాది జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చివేస్తాం అని రంగనాథ్ హెచ్చరించారు. కూకట్పల్లి కాముని చెరువు, మైసమ్మ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. గతంలో కట్టిన ఇండ్ల జోలికి హైడ్రా వెళ్లదు. ఆ ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రా టచ్ చేయదు. హైడ్రా జులై నెలలో ఏర్పాటు అయింది. హైడ్రా ఏర్పాటైన తర్వాత నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తప్పకుండా కూల్చేయడం జరుగుతుంది. అనుమతి లేకుండా ఎఫ్టీఎల్లో నిర్మిస్తున్న కట్టడాలపై చర్చలు తప్పవు. గతంలో అనుమతి తీసుకుని, ఇప్పుడు కట్టుకున్న వాటి వద్దకు కూడా వెళ్లబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక వేళ అనుమతి ఇచ్చినా.. అంగీకరించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాలసీలో భాగంగా చెరువులను కాపాడుతాం. ఎఫ్టీఎల్లో నిర్మాణాలను నివారించేందుకు హైడ్రా పని చేస్తుంది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని రంగనాథ్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు శాసనసభ ఆమోదం