Harish Rao | బడిలో ఉండాల్సిన పిల్లలు.. అనారోగ్యంతో ఆస్పత్రి పడకలపై.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలన్నీ అధ్వాన్నంగా మారాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బడిలో ఉండాల్సిన పిల్లలు.. అనారోగ్యంతో ఆస్పత్రి పడకలపై ఉంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలన్నీ అధ్వాన్నంగా మారాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బడిలో ఉండాల్సిన పిల్లలు.. అనారోగ్యంతో ఆస్పత్రి పడకలపై ఉంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చోటు చేసుకున్న ఘటనపై హరీశ్‌రావు స్పందించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ప్రాణాల మీదికి తెచ్చింది. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు? అనేక సార్లు ఆస్పత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదు. తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇది అత్యంత అమానవీయ ఘటన అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అనేకసార్లు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చు పడిపోయిన దారుణమైన పరిస్థితి. గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, గురుకుల బాటతో పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు, అనారోగ్యంతో ఆసుపత్రి పడకలపైకి చేరుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలని కోరుతున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినిని ప్రాణాల మీదికి తెచ్చింది.
మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి
అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు?అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు… pic.twitter.com/p5Kk1wSfCe
— Harish Rao Thanneeru (@BRSHarish) December 17, 2024
ఇవి కూడా చదవండి..
BRS MLCs | లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టు.. మండలి రేపటికి వాయిదా
Mohan babu | మనోజ్ కంప్లెయింట్‌లో నిజం లేదు.. పహాడి షరీఫ్ పోలీసులకు మంచు నిర్మలా దేవి లేఖ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

