Mohan babu | మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తండ్రీ కొడుకులు (మంచు మనోజ్, మంచు మోహన్‌బాబు) ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీస్ కంప్లెయింట్లు ఇచ్చుకుంటున్నారు. తన తల్లి నిర్మలా దేవి బర్త్‌డే పార్టీ శనివారం రాత్రి జరుగుతుండగా.. మంచు విష్ణుకి చెందిన మనుషులు జనరేటర్లో పంచదార పోశారంటూ మంచు మనోజ్ (Manchu Manoj) ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై నిర్మలా దేవి (Manchu Nirmala) తాజాగా స్పందించారు.
మంచు మనోజ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు వివరణ ఇస్తూ పహాడి షరీఫ్ పోలీసులకు మంచు నిర్మలా దేవి లేఖ రాశారు. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లి నివాసానికి వచ్చాడని తెలిపారు. తనతో కేక్ కట్ చేయించి బర్త్‌డే సెలబ్రేట్ చేసినట్లు చెప్పారు. విష్ణు ఎలాంటి దౌర్జన్యానికీ పాల్పడలేదని స్పష్టం చేశారు. మనోజ్ ఇచ్చిన కంప్లెయింట్‌లో నిజం లేదన్నారు. విష్ణు తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసి.. తన గదిలోని సామాను తీసుకొని వెళ్లిపోయినట్లు వివరించారు. అంతకు మించి అక్కడ ఎలాంటి గొడవా జరగలేదని మంచు నిర్మలా దేవి లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.
Another twist in #ManchuFamilyIssue!#ManchuMohanBabu‘s wife #ManchuNirmala sent a letter to police station against #ManchuManoj and #ManchuFamily ongoing issue! pic.twitter.com/QE3SVILV96
— KLAPBOARD (@klapboardpost) December 17, 2024
Also Read..
“Manchu Manoj | కొడుకు కోడలిపై మోహన్ బాబు దాడి.. దెబ్బలతో పీఎస్‌కు మంచు మనోజ్”
“Mohan babu | నేను ఎక్కడికీ పారిపోలేదు.. అజ్ఞాతం వార్తలపై స్పందించిన మోహన్‌బాబు”
“Manchu Mohan Babu | తుపాకిని సరెండర్ చేసిన మోహన్ బాబు”
“Manchu Manoj | మంచు కుటుంబంలో మరో వివాదం.. మనోజ్‌ను మళ్లీ టార్గెట్ చేసిన విష్ణు”
“Mohan babu | మోహన్ బాబుకు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.!”
“Manchu Mohan Babu | మా కుటుంబంపై బురద జల్లకండి : మోహన్‌బాబు”