Manchu Manoj | మంచు ఫ్యామిలీలో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలో మోహన్ బాబు జర్నలిస్ట్‌పై దాడి.. మంచు మనోజ్ గేట్ బద్దలుకొట్టిన ఘటన మరవకముందే తాజాగా మరో వివాదం చోటుచేసుకుంది. ఇంట్లో కరెంట్ ఆపేసి తనను చంపాలని చూస్తున్నారని పహాడీషరీఫ్ పీఎస్‌లో మరోసారి ఫిర్యాదు చేయనున్నాడు మంచు మనోజ్ కుమార్.
మోహన్ బాబు భార్య.. మంచు మనోజ్ తల్లి నిర్మల దేవి బర్త్‌డే పార్టీ శనివారం రాత్రి జరుగుతుండగా.. మంచు విష్ణుకి చెందిన మనుషులు జనరేటర్లో పంచదార పోశారంటూ ఆరోపించారు. దీంతో తన ఇంట్లో విద్యుత్ సరఫరా ఆగిపోయిందని.. చీకట్లో ఉన్న మమ్మల్ని అటాక్ చేయాలనే ఇలా చేశారంటూ మనోజ్ వెల్లడించారు.